🌸 స్వీయ శ్లోకమంజరి 🌸

ప్రారంభ పుట – గిరి ప్రసాద్ శర్మP చరవాణి : 9701609689

సేవాయాం సతతం భక్త్యా వినయం యోఽనుశీలయేత్ । చరణదూరవాణీ సంఖ్యా 9701609689॥ వట్సఅప్‌–సందేశవర్త్మనా వినీతః సంపర్కం కురు । భవత్యాశంసితం సర్వం శుభమన్యత్ ప్రదీయతామ్ ॥

संस्कृतम् (తెలుగు అక్షరాల్లో)

ఏతస్య పుటస్య స్థితాః సమస్తా శ్లోకా భావార్థా ఏవ మా స్వీయరచనాః।
యా లోపాన్మా జానిమి, సమ్యరికతా సరిద్దమ్యాతే।
గిరి ప్రసాద్ శర్మ।

గ్రంథపుస్తకాణి యే పఠంతి, తే మాం రుచిరం నాః,
తద్వలన స్వీయ శ్లోకమంజరీ ఆరంభితమ్,
ఏతస్య శ్లోకమంజరీ పుటం ఏకం యే ఇద్ది పుటం।

తెలుగు అర్థం

ఈ పేజీలో ఉన్న సమస్త శ్లోకములు, భావార్థాలు నా స్వీయరచనలు; లోపములు ఉంటే నాకు తెలియ, సరిచేయగలను.
పుస్తకాలలో, గ్రంథాల్లో ఉన్న వాటిని చాలామంది పఠిస్తారు; నాకు ఆ విధం ఇష్టం కాదు.
అందుకే స్వీయ శ్లోకమంజరి ప్రారంభించాను. ఈ శ్లోకాల కోసం ఒకే పేజీ పెట్టాను. ఇదుగో పేజీ.

🙏 గిరి ప్రసాద్ శర్మ కళ్ళే 🙏

బ్రహ్మశ్రీ శశిభూషణ సోమయాజీ చిరంజీవీ భవతు, సదా వర్ధతాం ।

శ్లోకం – 1 : ఉప్పల్ నుండి చిప్పలపల్లి వరకూ ప్రస్థానం
రచనా స్వర సమర్పణా — కళ్ళే గిరి ప్రసాద్ శర్మ ।

శ్లోకం :
ఉప్పలగ్రామసీమాయాం కించిద్వేదనికేతనమ్ ।
శిశువిద్యాలయాకారమ్ ఆరభ్య ధర్మతత్పరః ॥
ఆర్షవిద్యాప్రసారార్థం సంకల్పం యస్య దృఢీకృతమ్ ।
స శశిభూషణశర్మాఖ్యో గురురేకో మహాతపాః ॥

తాత్పర్యం :
ఉప్పల గ్రామ పరిధిలో ఒక చిన్న వేద పాఠశాలగా ప్రారంభమై,
శిశు విద్యా స్థాయిలోనే ఆర్ష విద్యను విస్తరించాలనే మహా సంకల్పంతో
ధర్మనిష్ఠతో ముందుకు సాగినవాడు
బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారు —
ఒక తపస్వి, ఒక మహాగురు.

శ్లోకం – 2 : విఘ్నాలు, అవమానాలు, స్థైర్య విజయం

శ్లోకం :
అధర్మబాధా నిందాభిః పీడితః సన్నిరాకృతః ।
బొడుప్పలే విసర్జిత్వా క్లేశానాపదసంయుతః ॥
న చచాల మనోధైర్యం న శాంతః సత్యమార్గతః ।
వజ్రసంకల్పబలేన చిప్పలపల్ల్యాం స్థిరీకృతమ్ ॥

తాత్పర్యం :
అన్యాయ నిందలు, వేధింపులు, అవమానాలు ఎదురైనా,
బొడుప్పల్ నుండి బలవంతంగా వెలివేయబడినప్పటికీ,
ఆయన మనోధైర్యం చలించలేదు, సత్యమార్గం విడిచిపెట్టలేదు.
వజ్రంలాంటి సంకల్ప బలంతో
చిప్పలపల్లిలో విద్యారణ్యాన్ని స్థిరంగా ప్రతిష్ఠించారు.

శ్లోకం – 3 : విద్యారణ్యం – వేద విశ్వవిద్యాలయ వైభవం

శ్లోకం :
శతపంచాశద్వేదార్థి శిష్యసంఘసమావృతమ్ ।
ఆర్షాధునికవిద్యాభ్యాం సమన్విత మహావనం ॥
విద్యారణ్యమితి ఖ్యాతం భారతస్య గిరా స్థితమ్ ।
విశ్వవేదవిశాలత్వే వర్తతే నాత్ర సంశయః ॥

తాత్పర్యం :
నేడు దాదాపు 150 మంది వేద విద్యార్థులతో,
ఆర్ష విద్య, ఆధునిక విద్య, కళలు, ఆత్మరక్షణ విద్యల సమన్వయంతో
భారతదేశంలోనే అత్యంత విశాలమైన, పవిత్రమైన
వేద విద్యా వాతావరణంగా
విద్యారణ్యం ప్రపంచ గౌరవాన్ని పొందుతోంది —
ఇది నిస్సందేహంగా ఒక వేద విశ్వవిద్యాలయ స్థాయికి ఎదిగింది.


లఘువిద్యాలయాత్ విశ్వవిద్యాలయత్వం యాత్రా యస్య జీవనసాక్షిణీ —
సైవ విద్యారణ్య మహాగాథా।

సర్వవేదవిద్యామూలం విద్యారణ్య మహావనం ।
శశిభూషణశర్మాణం గురుం వందే కృతాంజలిః ॥

ధర్మసంరక్షణార్థాయ యస్య జీవనసాధనమ్ ।
ఆర్షభారతవిద్యాయై దీర్ఘాయుష్మాన్ భవత్వయమ్ ॥

విద్యార్థివృద్ధిరస్త్వత్ర గురుకృపాసమన్వితా ।
వేదవిశ్వవిద్యాలయత్వం లభతాం శీఘ్రమేవ హి ॥

ఇతి గిరిప్రసాదశర్మ మంగళాశాసనం ॥

తాత్పర్యం :

సర్వ వేద విద్యలకు మూలమైన
ఈ మహానీయ విద్యారణ్యం అనే వటవృక్షాన్ని
స్థాపించి పెంపొందిస్తున్న
బ్రహ్మశ్రీ మాడుగుల శశిభూషణ శర్మ గారికి
నేను కృతాంజలి బద్ధంగా నమస్కరిస్తున్నాను.

ధర్మ పరిరక్షణే జీవన లక్ష్యంగా,
ఆర్ష భారత విద్య వికాసమే తన తపస్సుగా చేసుకున్న
ఈ గురువర్యులు
దీర్ఘాయుష్మంతులై చిరకాలం నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.

విద్యార్థుల సంఖ్య, విద్యా వైభవం
గురుకృపతో మరింత విస్తరించి,
అతి త్వరలోనే విద్యారణ్యం
వేద విశ్వవిద్యాలయ హోదా పొందాలని
హృదయపూర్వక మంగళాశాసనం చేస్తున్నాను.

విద్యారణ్యం చిరం జీయాత్ ।
వేదధర్మో విజృంభతామ్ ।
గురవః సంతు దీర్ఘాయుషః ।
భారతం పునరుద్ధరతామ్ ॥