🙏 శ్రీ వినాయక చవితి 2026 – వినాయక మండపాలకు ఉచిత ప్రసాదం 🙏

తులసీ వనం – బ్రాహ్మణ గర్ల్స్ అకాడమీ, బర్కత్‌పురా, హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం వినాయక మండపాలకు ప్రతిరోజూ గరిష్టంగా 3 కిలోల వరకు ఉచిత ప్రసాదం అందించబడుతుంది.

అందుబాటులో ఉండే ప్రసాదాలు: పులిహోర, పొంగలి, కట్టు పొంగలి, అటుకులు, వడలు మొదలైనవి. అందుబాటులో ఉన్న ప్రసాదాలు మాత్రమే ఉచితంగా ఇస్తారు, వేరే ప్రసాదం అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు.. దయచేసి అన్యధా భావించరాదు.

✅ ముందుగా అప్లికేషన్ ద్వారా నమోదు తప్పనిసరి.

✅ ఆమోదం వచ్చిన తర్వాత మాత్రమే ప్రసాదం ఇస్తాము.

✅ ప్రసాదాన్ని మా లొకేషన్‌కు వచ్చి స్వయంగా తీసుకెళ్లాలి.

❌ Rapido / Porter / ఇతర డెలివరీ సౌకర్యం లేదు.

✅ లొకేషన్ & పంపిణీ సమయాన్ని వ్యక్తిగతంగా తెలియజేస్తాము.

✅ 3 కిలోల కంటే ఎక్కువ కావాలంటే ₹150/- కిలో చొప్పున కొనుగోలు చేయవచ్చు.

దయచేసి అప్లికేషన్‌లో ఉన్న అన్ని సూచనలు పూర్తిగా చదివి పాటించండి.

తులసీ వనం – బ్రాహ్మణ గర్ల్స్ అకాడమీ
బర్కత్‌పురా, హైదరాబాద్

బ్రాహ్మిన్స్ హెల్ప్ డెస్క్
ఉచిత గణేష్ ప్రసాదాలు 2026
రోజుకు ఒక్కో మంటపానికి గరిష్టంగా 3కేజీలు మాత్రమే

స్వాగతం! పైన ఉన్న ఆప్షన్‌ను ఎంచుకుని మీ మంటపాన్ని ఉచిత గణేష్ ప్రసాదం కోసం నమోదు చేసుకోండి, ఆమోదించిన జాబితా చూడండి, లేదా అడ్మిన్‌గా లాగిన్ అవ్వండి.


Admin Login